మన పాఠశాల శతవసంతాల వేడుక 2019 జనవరి 12, 13 తేదీలలో అత్యంత వైభవముగా నిర్వహించు కున్నాము. మనం ఆశించిన దానికంటే మిన్నగా కార్యక్రమాలను నిర్వహించుకోవడం మన గ్రామ గత వైభవానికి అద్దం పట్టింది. పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం అంబరాన్ని తాకింది. ప్రజా నాట్యమండలి, విశాఖపట్నం వారి ప్రజా కళారూపాలు ప్రజలను ఆలోచింప చేసాయి. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మనసు పెట్టి పనిచేసిన కార్యకర్తలందరికీ అభినందనలు. ఆహ్వాన సంఘం విజ్ఞప్తిని మన్నించి పెద్ద మనసుతో విరాళాలు అందించిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏🙏.
ఈ నేలతల్లి బిడ్డలు జన్మభూమి రుణం తీర్చుకునేదానికి సన్నద్దం కావాలి. రాబోయే కాలంలో మన ఊరి వారి అందరికి ఉపయోగ పడే మంచి మంచి కార్యక్రమాలని చేసుకోవలసి ఉంది. రాజకీయాలను, గ్రూపులను, వర్గాలను దూరం పెడదాం మనం అందరం కలిసి నడుం భిగించి గ్రామాభివ్రుద్దికి బాటలు వేద్దాం....🙏🙏🙏
ఈ క్రింద విరాళాల మరియు వ్యయ వివరాలను అందిస్తున్నాము, మేము అన్ని వివరాలను ప్రచురించడానికి మా స్థాయిని ఉత్తమంగా ప్రయత్నించాము కాని కొన్ని పేర్లు లేదా వివరాలు అచ్చు పొరపాట్లలను ప్రతి ఒక్కరూ సహృదయం తో అర్థం చేసుకోగలరు అని ఆశిస్తున్నాము 🙏🙏🙏
మన పాఠశాల శతవసంతాల వేడుక 2019 ఈ కార్యక్రమాల యొక్క పూర్తి ఫొటొస్ & వీడియోలను చిన్న చిన్న భాగాలుగా చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది వీటిని ఈ క్రింది లింక్ ద్వారా అందరూ వీడియోలను వీక్షించ వలసినదిగా మరియు మన ఊరి వారందరికీ కూడా వీటిని పంపించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము…
మొదటి బాగం ఫొటొస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రెండవ బాగం ఫొటొస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ మన వెబ్ సైట్ యొక్కముక్య ఆశయం, మన ఊరి వారి అందరిని ఈ వేదిక ద్వారా దగ్గర చెయటం మరియు మన ఊరు లో జరిగిన, జరుగుచున్న వివిద కార్యక్రమముల వివరములను మన ఊరి వారి అందరికీ తెలియచేయటం. అంతే కాకుండా ప్రతీ ఒక్కరి లో సామాజిక చైతన్యం తీసుకువచ్చి మన ఊరి లో ఊన్న వివిద వివిద సమస్యల పై పరిష్కారాల కోసం మనమందరం కలిసి పనిచేయటం, మన ఊరుని అభివ్రుద్ది పదంలో మరింత ముందుకు తీసుకువెళ్ళే లా ప్రణాళిక చేయటం, కులాలకు..మతాలకు..వర్గాలకు..పార్టీలకు అతీతంగా మన ఊరి అభివ్రుద్దే ద్యేయంగా మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి.
మన బాల్యాన్ని అక్కడే గడిపాము, ఇప్పుడు కొంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాము.., మరి మన గ్రామానికి తిరిగి ఏదైనా చేయటానికి మన వంతుగా ప్రయత్నిద్దాం మనం అందరం కలిసి ..
కొప్పర్రు, ఇది నర్సాపురం టౌన్ నుండి 7 కి.మీ.ల దూరంలో ఉంది - భీమవరం వయా మత్యపురి రహదారి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. వ్యవసాయం మరియు విద్యారంగంలలో ప్రముఖ గ్రామాలలో కొప్పర్రు ఒకటి. ఐదు ఎలిమెంటరీ పాఠశాలలు మరియు ఒక జెడ్‌పిపి హైస్కూల్‌తో పాటు జనాభా సుమారు 11000. గ్రామ ఎన్‌ఆర్‌ఐలు ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. మీరు నిర్దిష్ట సమాచారం కోసం వెతుకుతున్న వారయినా లేదా కాల్ చేయడానికి అయినా, మీకు ఇక్కడ అవసరమయిన సమాచారం లభిస్తుంది. మేము మన ఈ వెబ్‌సైట్‌ను నిర్మించడం ప్రారంభించి నాలుగు సంవత్సరములు పైనే అయింది, సమయాన్ని బట్టి మరింత గా దీనిని మరింత అభివ్రుద్ది చేస్తూ ఊన్నాము, ఎవరయినా దీనిలో భాగస్వాములు కావాలి అనుకునేవారు (మీ సమయాన్ని కొంచెం అందించగలవారు) మమ్మల్ని సంప్రదించగలరు.
మా వినయపూర్వకమైన ప్రయత్నం మన ఈ వెబ్‌సైట్ ద్వారా కొప్పర్రు యొక్క చరిత్ర మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందరికీ ఈ వెబ్‌సైట్ ద్వారా తీసుకురావాలని మరియు మన కొప్పర్రు, తోటి స్థానికులను కూడా అదే వేదికపైకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి, మన ఊరి ప్రజలు ఒకరితో ఒకరు అనుసందానం అవ్వవచ్చు మరియు వారి అనుభవాలను పంచుకోవచ్చు. మన యువ తరాలు తమ గ్రామంతో దేశ - విదేశాల తరాలతో సహా సుపరిచితులు కావచ్చు. మీరు ఈ గ్రామానికి చెందినవారైతే, మేము మీ నుండి వినాలనుకుంటున్నాము. మాతో చేరాలని మరియు మన ఊరి కి సేవ చేయడంలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీకు ఏ రూపంలోనైనా మన ఊరి కి సంబంధించిన సమాచారం లేదా సామగ్రి ఉంటే, దయచేసి మాకు పంపండి. ఈ వెబ్‌సైట్‌ను మెరుగుపరచడంలో మాకు సహాయపడే ఏవైనా సూచనలు సలహాలు ఉంటే దయచేసి మాకు ఇమెయిల్ పంపండి: admin@kopparru.com. లేదా వాట్సప్ ద్వారా పంపండి: 9642577757 (చంద్రశేఖర్ కుంకటి)
CATEGORY | NAME | DESIGNATION |
---|---|---|
గ్రామ పంచాయితీ | శ్రీమతి నల్లి వరలక్ష్మి గారు | సర్పంచ్ |
గ్రామ పంచాయితీ | అందే శ్రీ కవికుమార్ గారు | వైస్ సర్పంచ్ |
సహకార సంఘం | పోలిశెట్టి దుర్గా శ్రీనివాస్ (బాబా) | అధ్యక్షులు |
మండలపరిషత్ | శ్రీమతి పత్తి లక్ష్మీ సంపూర్ణ గారు | ఎంపీటీసీ-1 |
మండలపరిషత్ | శ్రీమతి బద్దా శాంత కుమారి గారు | ఎంపీటీసీ-2 |
మన కొప్పర్రు గ్రామం లో రైతులు ముక్యంగా వ్యవసాయం వరి సాగుచేస్తారు మరియు ఆక్వాసాగు లో బాగంగా రొయ్యలు, చేపలు కూడా చాలా ఎకరాలలో సాగు చేస్తారు.పెద్ద ఎత్తున, క్రమబద్ధమైన సాగు తరచుగా గ్రామాలు మరియు నగరాల పెరుగుదలకు ముందు లేదా దానితో పాటుగా మరియు వ్యవస్థీకృత నాగరికత ఏర్పడటానికి కారణం అనటంలో ఎటువంటి సందేహం లేదు.ైతులు ప్రతీ నిత్యం వివిద పనులలో నిమగ్నమై ఉంటారు. ఈ రంగాలలో ఇంకా ఎంతో పురోగతి మరియు వివిద నూతన పద్దతులను మన రైతాంగం అవగతం చేసుకోవలి. తద్వారా మన గ్రామం మరింత అభివ్రుద్ది పదం లో పయనించాలి...
మన కొప్పర్రు గ్రామస్తులు వివిద ప్రాంతాలలో ఉద్యోగాలు వివిద సంస్థలలో చేస్తున్నారు. మాకు తెలిసిన మరియు తెలియజేసిన వారి వివరాలను ఈ క్రింద తెలియచేస్తున్నాము, మన వారికి ఎవరికి అయినా మీరు పనిచేసే సంస్ట లో ఏ మయినా వివరాలు కాని సహాయం కోసం మిమ్మల్ని ఎవరయినా సంప్రదిస్తే మీకు వీలయినంత మన వారికి సహకారాన్ని అందించ వలసినదిగా విజప్తి. ఈ క్రింద మీ వివరాలు లేనిచో / తప్పుగా ఉన్నచో మీ వివరాలను మాకు ఇమెయిల్ పంపండి: admin@kopparru.com. లేదా వాట్సప్ ద్వారా పంపండి: 9642577757 (చంద్రశేఖర్ కుంకటి) క్రింద తెలుపబడిన విదంగా.
Sno | Name | Location | Working in | Job/Field/Industry |
---|---|---|---|---|
1 | Anil Kumar Kadali | USA | L&T | IT |
2 | Balaji Valavala | Pune | IT | |
3 | Bavisetty Rama Krishna | Hyderabad | Sun Cam Technologies | Tools |
4 | Bollapragada V Padmaraju | Vijayawada | Indian Railways | Auditing |
5 | Brahmaji Polisetty | Doha, Qatar | Hamad Medical Corp | IT |
6 | ChallaRao Dodda | Hyderabad | Envision Solutions | IT |
7 | Chandrasekhar Kunkati | Hyderabad | Agility E-Services | IT |
8 | Dharmaraju Savaram | Bangalore | Barclays | Banking & Finance |
9 | KanakaRaju Kadali | Hyderabad | Seutic Pharma Pvt Ltd | Pharma |
10 | Kasiviswanatham Pattapu | USA | IBM | IT |
11 | Krishna Polisetty | Chennai | WorldDesk | IT |
12 | Krishnakant Nukala | Bangalore | TCS | IT |
13 | LakshmiNarayana | Hyderabad | CMS | Finance&Accounts |
14 | Lenin Kandula | Hyderabad | TechMahindra | IT |
15 | Madhavi Polisetty | USA | IT | |
16 | Malavya Polisetty | San Francisco, California | IT | |
17 | Manikanta Swamy Karra | Bangalore | Infosys | IT |
18 | MaruthiRao | Narasapuram | YNM Collage | Teaching |
19 | Naga Raj(Chinna Kommula) | Hyderabad | metrochem api pvt ltd | Finance&Accounts |
20 | Nanaji Polisetty | Oil & Gas | ||
21 | Narasimha Teja Polisetty | Bangalore | Nokia | IT |
22 | Narasimharao Polisetty | USA | IT | |
23 | Padmarao Chinimilli | Hyderabad | Pharma | |
24 | Parvathi Polisetty | USA | IT | |
25 | RAMBABU KOPPARTHY (Retd) | Amaravathi | INDIAN BANK | Banking & Finance |
26 | Ramesh Chinamilli | UAE | Emirates airlines | Tech |
27 | Ramesh Naidu Polisetty | Hyderabad | AM Enterprises | Finance&Accounts |
28 | Satish Mukku | Hyderabad | Zessta Software | IT |
29 | Siva Krishna Polisetty | Hyderabad | vSplash Techlabs Pvt. Ltd. | IT |
30 | Sunindra Babu Polisetty | Hyderabad | Lakshmi Enterprise | |
31 | Suryanarayana Dommeti | Hyderabad | Ineda Systems | IT |
32 | Veera N Polisetty | Bangalore | Accenture | Finance&Accounts |
33 | Venkata Rajababu Polisetty | Focus energy limited | Oil & Gas | |
34 | Venkataratnam Bejawada | Narasapuram | YNM Collage | Teaching |
35 | Vr Venkat | Visakhapatnam | Steel Plant | Manufacturing |
36 | Yaswanth Polisetty | Bangalore | CISCO | IT |
37 | Satyanarayana Lingam | NA | GP Secratary | Gram Panchayath |
జెడ్. పి. హై స్కూల్ కొప్పర్రు సెంటర్ లో వినాయకుడి గుడి దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో. నర్సాపురం మండలం లో ఉంది , దీనిలో 10 వ తరగతి 1987 సంవత్సరంలో ప్రారంబించబడినది మరియు స్కూల్ యొక్క నిర్వహణ స్థానిక తల్లిదండ్రుల కమిటీ ఆద్వర్యం లో జరుగుతూ ఉంటుంది. ఇది కో-ఎడ్యుకేషనల్ స్కూల్. దీనిలో లో మొత్తం విద్యార్థుల సంఖ్య 350 (సుమారుగా), మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 10, బోధనేతర సిబ్బంది 3 మరియు బోధనా మాధ్యమం తెలుగు & ఇంగ్లీష్....
ఏం.పి.పి స్కూల్ కొప్పర్రు పంచాయితీ ఆఫీస్ దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో. నర్సాపురం మండలం లో ఉంది , దీనిలో 5 వ తరగతి వరకు ఉంది . ఇది 1919 సంవత్సరంలో ప్రారంబించబడినది మరియు స్కూల్ యొక్క నిర్వహణ స్థానిక తల్లిదండ్రుల కమిటీ ఆద్వర్యం లో జరుగుతూ ఉంటుంది. ఇది కో-ఎడ్యుకేషనల్ స్కూల్. దీనిలో లో మొత్తం విద్యార్థుల సంఖ్య 150 (సుమారుగా), మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 5, మరియు బోధనా మాధ్యమం తెలుగు & ఇంగ్లీష్....
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - కొప్పర్రు నందు 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (ఆగస్టు 15 - 2016), ఈ సంధర్భము గా శెఖర్ కుంకటి, శీతయ్య కుంకటి వారి తాతయ్య న్నాన్నమ్మ (శీతయ్యకాపు, సత్యవతి) గార్ల జ్ఞాపకార్ధము గా 7000/- రుపాయల విలువ చేసే బెల్త్స్ పిల్లలందరికి పంపినీ చేసారు మరియు ఈ సంధర్భము గా 7000/- రుపాయల విలువ చేసే టాగ్+కార్ద్ పిల్లలందరికి శ్రీ చినమిల్లి దుర్గా ప్రసాద్ గారు, గౌతమి కాలేజస్, నరసాపురం వారు పంపినీ చేసారు.
ప్రియమయిన మిత్రులారా, మన ఊరి జెడ్ పి హెచ్ స్కూల్ వార్షిక రోజు (Annual Day) 28/02/2017 న జరిగినది, ఈ కార్యక్రమము లో మెరిట్ విధ్యార్ధులకు మరియు ఇవెంట్స్ విన్నర్స్ కి (8000/- రూపాయల విలువ కలిగిన) ట్రొఫి లు, మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ లను మన మిత్రుడు నరసింహ రావు పోలిశెట్టి, తన తండ్రి నారాయణ మూర్తి గారి (సీతయ్య గారి) జ్ఞాపకార్దం అందచేసారు. ఇదే విదముగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మనకు వీలయినంత మరింత ముందుకు తీసుకువెళదాము.
ప్రియమయిన మిత్రులారా, మన ఊరి కొప్పర్రు, జెడ్ పి పి స్కూల్ మధ్యాహన్న భోజన పధకానికి అవసరమయిన వంట సామగ్రిని మన మిత్రులు అందజేసారు వారందరి కీ పేరుపేరు నా కృతజ్ఞతలు..... ఇలాంటి మంచి సేవాకార్యక్రమాలు ముందు ముందు మరిన్ని జరగాలి అని కోరుకుంటూ.....
మన ఊరి జెడ్ పి హెచ్ స్కూల్ వార్షిక రోజు మరియు ఎం పి పి స్కూల్ వార్షిక రోజు జరిగినవి, ఈ రెండు కార్యక్రమము ల లో మెరిట్ విధ్యార్ధులకు మరియు ఇవెంట్స్ విన్నర్స్ కి (8070/- రూపాయల విలువ కలిగిన) ట్రొఫి లు, మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ లను మన మిత్రులు అందచేసారు వారి అందరికి ధన్యవాదములు ఇదే విదముగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాలను మనకు వీలయినంత మరింత ముందుకు తీసుకువెళదాము... ఇదే విదముగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మనకు వీలయినంత మరింత ముందుకు తీసుకువెళదాము.ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు సహాయము చేసిన వారి అందరికి పేరుపేరునా మరి యొక్క సారి ధన్యవాదములు
శ్రీ. డా. కుంకటి శ్రీరాముర్తి గారు మన ఊరి కొప్పర్రు, జెడ్ పి హై స్కూల్ నందు కళా వేదికను నిర్మించారు. నిర్మించిన వారికి మరియు ఈ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాధములు తెలియచేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ఊరి లో మరిన్ని జరగాలి అని కొరుకుంటున్నాము. ఇట్లు, కొప్పర్రు గ్రామ యువత...
మన ఊరి కొప్పర్రు, జెడ్ పి హై స్కూల్ నందు ముఖద్వారమును కీ.. శే.. పోలిశెట్టి రంగారావు గారి జ్ఞాపకార్దం వారి కుమారుడు శ్రీ నాగశేషు గారు నిర్మించారు. నిర్మించిన వారికి మరియు ఈ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాధములు తెలియచేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ఊరి లో మరిన్ని జరగాలి అని కొరుకుంటున్నాము. ఇట్లు, కొప్పర్రు గ్రామ యువత...
మనఊరికొప్పర్రు, ఎం పి పి స్కూల్స్ లో & జెడ్ పి హై స్కూల్ లో Agility E-Services, Hyderabad వారు నోట్ బుక్స్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు Agility E-Services, Hyderabad వారికి మా యొక్క ధన్యవాధములు తెలియచేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు మనఊరిలో మరిన్ని జరగాలి అని కొరుకుంటున్నాము. ఇట్లు, కొప్పర్రు యువత...
మన ఊరి జెడ్ పి హెచ్ స్కూల్ వార్షిక రోజు మరియు ఎం పి పి స్కూల్ వార్షిక రోజు జరిగినవి, ఈ రెండు కార్యక్రమము ల లో మెరిట్ విధ్యార్ధులకు మరియు ఇవెంట్స్ విన్నర్స్ కి (10,000/- రూపాయల విలువ కలిగిన) ట్రొఫి లు, మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ లను మన పోలిశెట్టి రెడ్డినాయుడు, సత్యవతి గార్ల జ్ఞాపకార్ధం గా వారి కుమార్తెలుు అందచేసారు వారి అందరికి ధన్యవాదములు 🙏🙏🙏. ఇదే విదముగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాలను మనకు వీలయినంత మరింత ముందుకు తీసుకువెళదాము...
Inprogress.
Temples
Inprogress.
News
Inprogress.
Library
Inprogress.
Trust
Inprogress.
Gallery
Inprogress.
Our Team
Inprogress.
Contact